Last Updated:

Marimuthu : కోలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మారిముత్తు మృతి

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, ప్రముఖ నటుడు జి. మారిముత్తు ఈరోజు ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు 57 ఏళ్ల వయసు. దీనితో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి

Marimuthu : కోలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మారిముత్తు మృతి

Marimuthu : కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, ప్రముఖ నటుడు జి. మారిముత్తు ఈరోజు ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు 57 ఏళ్ల వయసు. దీనితో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆయన మరణించిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన గుండెపోటుతో మరణించడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. జైలర్ లో పన్నీరు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో విలన్ కు నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. అంతకు ముందు ఎనిమి, డాక్టర్ ఇలా వరుసగా పలు తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మారి ముత్తు. ఇండస్ట్రీలో మొదట సహాయ దర్శకుడిగా తన జర్నీని స్టార్ట్ చేసిన మారి ముత్తు, ఆ తర్వాత నటుడిగా మారారు.

శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుకి గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాదిరి ముత్తు 100కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. దర్శకుడిగా కూడా కొన్ని చిత్రాలు తెరకెక్కించారు. మారి ముత్తు చివరగా రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటించారు. విలన్ కి నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో మారి ముత్తు నటించడం విశేషం. 1999లో అజిత్ నటించిన ‘వాలి’ సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2008లో ‘కన్నుమ్ కన్నుమ్’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. డైరెక్టర్ గా మారకముందు మణిరత్నం, వసంత సీమన్, SJ సూర్య లాంటి ప్రఖ్యాత దర్శక నిర్మాతల దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు.

Image

ఇంట్లో చిత్ర పరిశ్రమలోకి వెళ్ళడానికి అంగీకరించకపోవడంతో మారి ముత్తు పారిపోయి వచ్చారట. తాజాగా ఆయన మరణంతో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మారి ముత్తుకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. బుల్లితెరపై కూడా ఎన్నో ధారావాహికల్లో మంచి పాత్రలను పోషించారు. అయితే దర్శకుడిగా మాత్రం మారిముత్తు సక్సెస్ కాలేకపోయారు.