Killer Glimpse: గుప్పెడంత మనసు జగతీ ఆంటీ హీరోయిన్ గా కిల్లర్.. గ్లింప్స్ చూశారా .. అదిరిపోయింది

Killer Glimpse: గుప్పెడంత మనసు సీరియల్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ సీరియల్ లో రిషి, వసుధార ఎంత ఫేమసో.. జగతి ఆంటీ కూడా అంతే ఫేమస్. నిండైన కట్టు, బొట్టుతో హీరోయిన్ కి ఏ మాత్ర తీసిపోని అందంతో ప్రేక్షకులను అలరించిన ఆమె జ్యోతి పూర్వాజ్. కన్నడలో ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా జ్యోతి.. గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి గుర్తు తెచ్చుకుంది.
ఇక గతేడాది తెలుగు డైరెక్టర్ పూర్వాజ్ నీ వివాహం చేసుకొని సెటిల్ అయ్యిన జ్యోతి… హీరోయిన్ గా మారింది. ఆమె చేతిలో వరుసగా అరడజన్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కిల్లర్. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జ్యోతినే ఇంకొంతమందితో కలిసి నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కిల్లర్ ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
వైమానిక శాస్త్రం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఎక్కువ టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిపి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ .. యంత్రంగా మారుతుంది. ఆత్మ కలిగిన యంత్రంగా మారిన హీరోయిన్.. ఒకపక్క మనిషిగా.. ఇంకోపక్క మెషిన్ గా మారుతూ ఉన్నట్లు చూపించారు. ఇక యంత్రంగా ఉన్నప్పుడూ హీరోయిన్ కిల్లర్ గా మారుతుంది. అసలు హీరోయిన్ కి ఏమైంది..? ఆత్మ కలిగిన యంత్రం అసలు ఏం చేయాలని వచ్చింది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక జ్యోతి.. తన అందాన్ని ఈ సినిమాలో విచ్చలవిడిగా చూపించేసింది. ఇంకోపక్క యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే కిల్లర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో జగతి ఆంటీ హిట్ అందుకుంటుందా.. ? లేదా..? అనేది చూడాలి.