Last Updated:

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకీ చంటి ఎలిమినేట్

బిగ్ బాస్ షో నుంచి ఆదివారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇదీ నిజంగా షాకింగ్ న్యూస్. వైరల్ అయ్యింది.

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకీ చంటి ఎలిమినేట్

Big Boss 6: బిగ్ బాస్ షో నుంచి ఆదివారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇదీ నిజంగా షాకింగ్ న్యూస్. వైరల్ అయ్యింది. బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుంది. ఎమోషన్స్ ఎలా పండుతాయనేది ప్రతి ఆదివారం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలోనూ ఆ ఎమోషన్స్ అన్ని కనిపించాయి. అయితే, ఆ ఎమోషన్స్‌లో రొమాన్స్ కూడా కలిసింది.

ఈ వారం నామినేషన్స్‌లో ఇనయా, చంటి, అర్జున్, మెరీనా మిగిలారు. ఈ నలుగురికి నాలుగు లాలీపాప్స్ ఇచ్చారు. నాగార్జున చెప్పే ఒక్కొక్కరు వారి లాలీపాప్ కవర్‌ను ఓపెన్ చేయాలి. ఎవరి లాలీపాప్ కలర్ గ్రీన్ ఉంటే వాళ్లు సేఫ్ అన్న మాట. కవర్లో రెడ్ ఉంటే నాట్ సేఫ్ అన్నట్టు ఐతే, ఈ ప్రాపెస్‌లో మెరీనా ఒక్కరే సేఫ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఎవరు సేఫో చెప్పడానికి ఇంకో ప్రాసెస్ జరిగింది. ఈ సారి కప్ కేకులు ముగ్గురుకు ఇచ్చారు. దాన్ని కొరికితే లోపల ఎవరికి గ్రీన్ వస్తే వాళ్ళు సేఫ్, రెడ్ వస్తే నాట్ సేఫ్, ఈ ప్రాసెస్‌లో అర్జున్ కేక్‌లో గ్రీన్ వచ్చింది. దీంతో ఫైనల్‌గా ఇనయా, చంటి మిగిలారు.

ఇంకో వైపు చంటి, ఇనయాలో ఎవరో ఒకరు వెళ్లిపోతారనే బాధతో ఫైమా ఏడ్వడం మొదలుపెట్టింది. మీరిద్దరూ నాకు చాలా ఇంపార్టెంట్ అన్న అంటూ చంటిని పట్టుకుని బోరున ఏడ్చేసింది. ఈ ఎమోషనల్ డ్రామా మధ్య నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇనయా, చంటీలకు రెండు డబ్బాలు ఇచ్చి ఎవరి డబ్బాలో వాళ్లను చేయి పెట్టి తిప్పమన్నారు. చేయి ఎర్రగా అయితే ఎలిమినేటెడ్, పచ్చగా అయితే సేఫ్ అని నాగార్జున అంటాడు. చంటి చేయి ఎర్రగా అవుతుంది. చంటి ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించారు. వెంటనే చంటి గారు అంటూ ఇనయా ఏడ్వడం మొదలుపెట్టింది. మీరు వెళ్లొద్దు. నేను వెళ్లిపోతా అంటూ ఇంకో డ్రామా మొదలుపెట్టింది. మొత్తం మీద చాలా బాధతో చంటిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపారు.

ఇవి కూడా చదవండి: