AP Mega DSC: మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా

AP Mega DSC Notification Postponed: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. అయితే అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ పలు అనివార్య కారణాల దృష్ట్యా అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఇవాళ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆశగా ఎదురు చూశారు. అయితే,ఈ నోటిఫికేషన్ విడుదల తాత్కాలికంగా వాయిదా పడడంతో కొంత నిరాశకు గురయ్యారు.