Home / క్రైమ్
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
వివాహేతర సంబంధాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నచిన్న మనస్పర్థలే అనేక సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడి మోజులో పడిన ఓ ఇళ్లాలు తన ఇంట్లోనే రూ. 2కోట్లను ఊడ్చేసింది. అదీ చాలనట్టుగా అత్తమామల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భర్తనే బెదిరించసాగింది. ఈ ఉదంతం ఢిల్లీలో జరిగింది.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
బీహార్లోని ముజఫరా పూర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు దోచుకుపోయారు. సదర్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోబర్షాహి బ్రాంచిలో ఈ సంఘటన జరిగింది.
నిందితులకు తగిన గుణపాఠం పేరుతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్య నాధ్ తీసుకొచ్చిన బుల్ డోజర్ వ్యవస్ధను భాజాపా మద్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరిచింది. ఈమేరకు ఓ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందుతుల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చివేసి ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది.
ఏపీలో పెద్ద దుమారం లేపిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సర్వోత్తమ న్యాయస్ధానం విచారణ చేపట్టింది.
బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలు తీసింది. పెళ్లైందని చెప్పినా వినిపించుకోకుండా ఆ మృగాడు ఆ మహిళకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. ఫోన్ ఎత్తకపోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అంతటితో ఆగక ఆమె భర్తను వదిలేసి రావాలని హింసించేవాడు. దానికి నిరాకరించిందని ఆ మహిళను నేడు బీర్ బాటిల్తో గొంతుకోశాడు.
బాధ్యత గల వృత్తిలో ఉండి మానవత్వంతో సేవ చేయాల్సిందిపోయి... కర్కశంగా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాల్సిన వైద్యుడు ఓ మూగజీవి ప్రాణం తీసేందుకు యత్నించాడు. కుక్కను కారుకు కట్టేసి ఊరంతా పరిగెత్తించాడు. కారు వెంట పరుగెత్తలేక ఆ మూగజీవి చిత్రహింస అనుభవించింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.