Wife killed husband with Lover: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Wife killed husband with Lover:కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా సంఘటన విషయానికి వస్తే ఇది హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించడానికి భార్య ప్రయత్నించింది. అయినా అతను బతికాడు. మొదటి ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 5, 2021లో పంజాబ్ రిజిస్ర్టేషన్ వాహనంతో భర్త వినోద్ బరాడాను ఢీ కొట్టడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. అయితే ప్రాణాలతో బతికాడు. రెండు నెలల తర్వాత అతని భార్య నిధి డిసెంబర్ 15, 2021లో తన ఇంట్లోనే కిరాయి హంతకుడితో తుపాకితో కాల్చి చంపించింది. రెండో ప్రయత్నంలో భర్త చనిపోయాడు. కాగా మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా ఇప్పుడు వెలుగు చూసింది.
వినోద్ మరణం తర్వాత వినోద్ మామ వీరేంద్ర డిసెంబర్ 21లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో వినోద్‌ను కారుతో ఢీ కొట్టిన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 15 రోజుల తర్వాత డ్రైవర్ దేవ్ సునార్ వినోద్‌తో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే వినోద్ అంగీకరించలేదు. డిసెంబర్ 15 ,2021లో దేవ్‌సునార్ పిస్టల్ తీసుకొని వినోద్ ఇంటికి వెళ్లి వినోద్ నడుము, తలపై కాల్పులు జరిపాడు. వినోద్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి అప్పటికే చనిపోయాడు. తర్వాత పోలీసులు దేవ్ సునార్‌ను పానిపట్ జైలుకు పంపారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.
వినోద్ సోదరుడి ఫిర్యాదుతో..(Wife killed husband with Lover)
ఇదిలా ఉండగా వినోద్ సోదరుడు ఆస్ర్టేలియాలో నివసిస్తున్నాడు. తన సోదరుడి మృతిపై అనుమానాలున్నాయని వాట్స్‌యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దీనిపై తిరిగి సీరియస్ దర్యాప్తు మొదలుపెట్టారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని లోతుగా దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు వాస్తవాలు వెలుగుచూశాయి. వాస్తవానికి దేవ్ సునార్‌ను వినోద్ భార్య ప్రియుడు సుమిత్ సుపారి ఇచ్చి చంపించాడు. వినోద్ భార్య నిధితో సుమిత్ చొరవగా ఉండేవాడు. ఈ నెల 7న సుమిత్‌ను అరెస్టు చేసి విచారణ జరిపితే వినోద్ హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని అంగీకరించాడు.దేవ్ సునార్ ద్వారా చంపించినట్లు పోలీసుల ముందు వాస్తవాలు వెల్లడించాడు.
ఇక అసలు విషయానికి వస్తే సుమిత్ జిమ్‌లో ట్రైనర్. నిధితో 2021లో పరిచయం అయ్యింది. అటు తర్వాత వీరద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న భర్త వినోద్ భార్యను మందలించాడు. భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వినోద్‌ను చంపేయాలని సుమిత్, నిధి పక్కా ప్లాన్ వేశారు. ముందు కారుతో గుద్ది చంపాలనుకున్నారు. అది విఫలం కావడంతో కాల్చి చంపించారు. పోలీసుల విచారణలో వినోద్ హత్యకు దేవ్ సునార్‌కు సమిత్ రూ.10 లక్షల ఆఫర్ చేశాడు. కాగా గత శనివారం నాడు విచారణకు నిధి, సుమిత్ కోర్టు హాజరయ్యారు. కోర్టు వీరిద్దరిని జ్యూడిషియల్ కస్టడీకి పంపించింది.