Published On:

Best Family Cars: ఈ కార్లలో మొత్తం ఫ్యామిలీ ఈజీగా వెళ్లచ్చు.. రైళ్లు, బస్సులు అవసరం లేదు..!

Best Family Cars: ఈ కార్లలో మొత్తం ఫ్యామిలీ ఈజీగా వెళ్లచ్చు.. రైళ్లు, బస్సులు అవసరం లేదు..!

Best Family Cars: భారత్‌లో 7 సీట్ల కార్లు చాలా ఫేమస్ అయ్యాయి. సామాన్యులు ఎక్కువగా సరసమైన ధరలో ఏడు సీట్ల ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైన కారు రెనాల్ట్ ట్రైబర్. దీని తరువాత, మారుతి, మహీంద్రా బ్రాండ్లు కూడా మంచి 7 సీట్ల కార్లను అందిస్తున్నాయి. ధర పెరిగే కొద్దీ ఫీచర్లు, నాణ్యత పెరుగుతాయి. కాబట్టి, భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సరసమైన 7 సీట్ల కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Renault Triber
ముందు చెప్పినట్లుగా, రెనాల్ట్ ట్రైబర్ భారతదేశంలో అత్యంత సరసమైన 7 సీట్ల కారు. దీని బేస్ వేరియంట్ RXE వేరియంట్ ధర రూ. 5.99 లక్షల నుండి టాప్ వేరియంట్ ధర 8.97 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కూల్డ్ స్టోరేజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

 

రెనాల్ట్ ట్రైబర్ గరిష్ట భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. దీనికి 4 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్‌లో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజిజ్ గరిష్టంగా 72 పిఎస్ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఇది లీటర్‌పై 18.2 నుండి 20 కిమీ మైలేజీని అందిస్తుంది.

 

Maruti Suzuki Ertiga
సరసమైన ధర, మైలేజ్, విశాలతకు ఈ 7 సీట్ల కారు ప్రసిద్ధి చెందింది, ప్రస్తుతం భారతదేశంలో అత్యుత్తమ కుటుంబ కారు. మారుతి ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.69 లక్షల నుండి రూ. దీని ధర రూ. 13.03 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.

 

ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ AT కి జత చేసి ఉంటుంది. CNG తో నడిచేటప్పుడు ఈ ఇంజిన్ ప్రత్యేకంగా 5-స్పీడ్ MT తో లభిస్తుంది. ఎర్టిగా మైలేజ్ లీటరుకు 22 కిమీ. ఇది దాని విభాగంలోని ఇతర కార్ల కంటే ఎక్కువ.

 

కంపెనీ ప్రకారం.. పెట్రోల్ MTలో లీటరుకు 20.51 కి.మీ, పెట్రోల్ ATలో లీటరుకు 20.3 కిమీ, CNG MTలో కిలోకు 26.11 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది. LXi, VXi, ZXi , ZXi+. వాటిలో రెండు, VXi, ZXi, ఆప్షనల్ CNG కిట్‌తో వస్తాయి.