Published On:

Discount on Nissan Magnite Carnival: కారు కొంటే బంగారం ఇస్తున్నారు.. నిస్సాన్ మాగ్నైట్‌పై హ్యాట్రిక్ కార్నివాల్ ఆఫర్‌.. ఛాన్స్ కొట్టారు పో!

Discount on Nissan Magnite Carnival: కారు కొంటే బంగారం ఇస్తున్నారు.. నిస్సాన్ మాగ్నైట్‌పై హ్యాట్రిక్ కార్నివాల్ ఆఫర్‌.. ఛాన్స్ కొట్టారు పో!

Amazing Discounts on Nissan Magnite Carnival: ఐపీఎల్ జోరు ఇప్పుడు కార్ మార్కెట్‌పై పడింది. నిస్సాన్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీపై మాగ్నైట్ హ్యాట్రిక్ కార్నివాల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎస్‌యూవీపై రూ. 55,000 వరకు ప్రయోజనాలు అందించనుంది. అదనంగా రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, బంగారు నాణెం కూడా ఉచితంగా ఇస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే. మాగ్నైట్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Nissan Magnite Price
నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.14 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు డిజైన్ బాగుంది కానీ లోపలి భాగం నిరాశపరుస్తుంది. మీకు అందులో మంచి స్థలం లభిస్తుంది. దీనిలో 5 మంది హాయిగా కూర్చోవచ్చు. వెనుక కూర్చున్న వారికి స్థలం కొరత లేదు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. మాగ్నైట్‌లోని 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్ చూడచ్చు. కొత్త మాగ్నైట్‌లో సింగిల్-పాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా ఉంది. దానితో పాటు ఒక కొత్త కీ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆటో లాక్, అప్రోచ్ అన్‌లాక్, రిమోట్ స్టార్ట్‌ను యాక్టివేట్ చేస్తుంది.

 

Nissan Magnite Engine And Safety
మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది, వీటిలో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0L నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌కి జతై ఉంటాయి. కొత్త మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది. దీనికి భద్రత పరంగా 4 స్టార్ రేటింగ్ లభించింది.

 

సేఫ్టీ విషయానికి వస్తే.. మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్టిబ్యూషన్,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. నిస్సాన్ మాగ్నైట్ నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లతో పోటీపడుతుంది. ఎక్స్‌టర్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ ధర రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.