Home /Author
బిలియనీర్లు నేటి ప్రపంచంలో, విజయానికి పర్యాయపదాలు. వారు లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటికీ నిచ్చెనపై ఉన్న లక్షలాది మందికి ప్రేరణగా మారారు. ఈ ధనవంతులను చూసినప్పుడు, వారి అపారమైన సంపదను చూసి మనం తరచుగా ఆశ్చర్యానికి లోనవుతాము.వారిలో చాలా మందికి, ఈ రోజు ఉన్న ఈ స్దాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, స్వేదాన్ని చిందించారనేది మనకు తెలియదు.
మనలో చాలా మందికి నిద్ర రుగ్మతలు చాలా సాధారణం. నిద్రలేమికి చికిత్స చేయడానికి అనేక రకాల మందులు వున్నాయి. మరోవైపు కొంతమందికి తగినంత ఎక్కువ నిద్ర ఉన్నప్పటికీ పగటిపూట మెలకువగా మరియు అప్రమత్తంగా ఉండలేరు. దీనిని హైపర్ సోమ్నియా అంటారు. ఇది పని జీవితం, సామాజిక మరియు గృహ జీవితానికి సవాళ్లను కలిగిస్తుంది.
దేశం వేగంగా అభివృద్ది చెందడానికి 'సబ్కా ప్రయాస్' పునాది అని ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూరత్ లో జరుగుతున్న నేచురల్ ఫార్మింగ్ కాన్క్లేవ్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, దేశం వివిధ లక్ష్యాల కోసం పని చేయడం ప్రారంభించిందన్నారు.
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.
ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు బక్రీద్ ను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కుటుంబ సభ్యులనే కాకుండా తమ స్నేహితులను కూడ విందుకు ఆహ్వానిస్తారు. ఈ సందర్బంగా మెనూలో ఉండే సంప్రదాయ వంటకాల జాబితా ఇక్కడ ఉంది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్షిప్లోని బార్లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.
వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. .సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా వుండాలి.ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏవిషయమైనా కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.