Home /Author
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు అందిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
అనకాపల్లి జిల్లా బవులువాడ గ్రామ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఆవు దూడపై దాడి చేసిన పుని సమీప అడవిలోకి వెళ్లింది.
Prime9News Desk: ప్రపంచ వ్యాప్తంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ప్రభుత్వాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పదవిలో లేకున్నా మాజీ ప్రధానులకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అయినప్పటికీ ఎంతో మంది దేశాధినేతలు గతంలో దుండగుల కాల్పులకు బలయ్యారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో.. గతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండి కూడా పలువురు ప్రముఖ నేతలు హత్యకు గురయిన నేతలు ఘటనల […]
నటి సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితంపట్ల సోషల్ మీడియాలో అనవసర ప్రచారం సాగుతోందని అన్నారు. తన వివాహం గురించి చర్చ జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. తన తల్లిదండ్రులు కూడా తన వివాహం గురించి అంతగా ఆసక్తి చూపడం లేదని ఆమె అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది కానీ ప్రేక్షకులను లేదా అభిమానులను పెద్దగా సంతృప్తి పరచలేదు. పోకిరి లేదా అతడు వంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడంలో సినిమా విఫలమైందని వారు అభిప్రాయపడ్డారు.
తన చివరి చిత్రం రెడ్ పరాజయం తర్వాత హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం ది వారియర్ విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది.
వాట్సాప్ చాటింగ్ ను సమకాలీకరించడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. కంపానియన్ మోడ్ అని పిలువబడే ఈ ఫీచర్, యాక్టివ్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే వారి వాట్సాప్ ఖాతాకు రెండవ మొబైల్ పరికరాన్ని లింక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు, దీని అర్థం దేవుని భూమి. ప్రతీ ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షలాదిమంది తరలివస్తారు . అయితే తీర్దయాత్రలకే కాకుండా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుదామనుకునే వారికి ఉత్తరాఖండ్ లో అద్బుతమైన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ విధంగా వున్నాయి.