Home /Author Guruvendhar Reddy
Massive Encounter in Mulugu Dist: తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో వద్ద చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఆపరేషన్‌లో భాగంగా ఒక్కసారిగా ఒక్కరికొకరు ఎదురుపడడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు […]
Minister Sridhar Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాల్ అన్నారు. గచ్చిబౌలిలోని టీహబ్ లో బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (బిక్కి)ఆధ్వర్యంలో అవార్డ్స్-2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామిక […]
CM Revanth Reddy speech in the Praja Palana Vijayostsavalu at Mahabubnagar: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు. నల్లమల బిడ్డగా అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తానని శపథం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్2లో నిర్వహించిన రైతు పండగ సభలో సీఎం ప్రసంగించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. […]
New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది. ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ […]
Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం […]
CM Chandrababu says Zero tolerance for corruption in pension distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతామన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం, బొమ్మనహళ్లి మండలంలోని నేమకల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల […]
Burra Venkatesham Appointed as TGPSC Chairman 2024: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకానికి శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర లభించింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఎం మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుండటంతో ప్రభుత్వం చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనేక వడపోతల తర్వాత.. నోటిఫికేషన్ నాటి నుంచి నవంబరు 20 వరకు ప్రభుత్వం […]
Former minister Tanniru Harish Rao Fire on revanthreddy: రైతుబంధును రూపుమాపే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనస్ మేలని రైతులు చెబుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. […]
Global debt burden: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని గత ఏడాది కాలంగా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు వారి అనుమానాలు నిజం కాబోతున్నాయనే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మిలిటరీ వ్యయాలు, ఆధిపత్యం కోసం సాగుతున్న యుద్ధాలతో బాటు ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు, కొవిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ప్రపంచాన్ని వేగంగా మరో మహా ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయని నిపుణులు […]
KTR Sensational Decision On Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాఫిక్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరిస్తున్నది. ఏడాదిపాటు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్ కు తాత్కాలికంగా […]