Home /Author Jyothi Gummadidala
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ నెట్టింట గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమన్నా ఆస్తి కోసమే వివాహం చేసుకుంటుందని అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం వల్లే పెళ్లికి అంగీకరించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కాగా వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తను పెళ్లి చేసుకునేది ఇతనేనంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
భార్యను కాపురానికి రప్పించాలనుకుని అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఓ భర్త బాంబు ఉందంటూ ఫేక్ కాల్‌తో అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరకి నిందితుడిని అరెస్ట్ చేసి 18 రోజులు జైలులో ఉంచారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కళ్యాణదుర్గం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "బెస్ట్ కపుల్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.
జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలకు పాల్పడుతోందని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన హౌసింగ్ లేయవుట్లలో చాలా అక్రమాలు జరిగాయంటూ జనసైనికులు మండిపడ్డారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత నటశేఖరుడి అంతమ యాత్ర ప్రారంభమైంది. అశేష జనవాహిని అశ్రునయనాల నడుమ అనంతలోకాలకు పయమనమయ్యారు కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర కదిలింది.