Home /Author Jyothi Gummadidala
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాల దృష్ట్యా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. కాగా ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మరియు సినీ ప్రముఖులు అయిన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ వంటి పలువురు తారలు నివాళులర్పించారు. సినీలోకం దిగ్గజ నటుడిని కోల్పోయిందని వారు అన్నారు.
ప్రపంచంలో కేవలం 45 మంది మాత్రమే కలిగి ఓ కొత్త రకం బ్లడ్ గ్రూప్ ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకనే ఈ బ్లెడ్ చాలా అరుదైనదని విలువైనదని అంటున్నారు. ఇంతకీ ఈ బ్లెడ్ గ్రూపు పేరేంటో తెలుసా గోల్డెన్ బ్లడ్ గ్రూప్.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) 2023 పరీక్షపై ఇటీవల పలు రాకాల తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. కాగా జేఈఈ పరీక్ష తేదీల విషయంలో విద్యార్థులు కన్ప్యూజ్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై ఎన్టీఏ స్పందించింది. జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో తేదేపాకు పూర్వ వైభవం తీసుకరావడమే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది.
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో విషాదం నెలకొనింది. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఐపీఎల్ 2023 ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగిసిపోయింది. మినీ ఆక్షన్ కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేశాయి. ఇక వేలంలో ఎవరుంటారనేది తేలిపోయింది. వేలంలో ఎవరిని ఎంతపెట్టి ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.