Home /Author Jyothi Gummadidala
నేటి తరం ప్రజలకు చాలా మందికి మన సంప్రదాయ వైద్యం గురించి కానీ ఆహార వ్యవహారాల గురించి కానీ పెద్దగా తెలియదని చెప్పవచ్చు. అయితే అలాంటి పురాతన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఒకటయిన పిండి కూర ఆకు దీనిని పాషాణభేది, కొండపిండి చెట్టు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు. మరి ఈ మొక్క విశిష్టతలేంటి ఎక్కడ దొరకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన టెక్-టైజింగ్- గ్రావిటీ ఆటమ్స్‌ను ప్రఖ్యాత సినీ దర్శకధీరుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ డిజిటల్ రంగంలో యాడ్స్ ప్రధానంగా మారాయని, ఎన్ని యాడ్స్ పెరిగితే అంత పని కూడా పెరుగుందని, ఇలాంటి తరుణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
ఒక్క సైకిల్ పై మహా అంటే ఇద్దరు కూర్చోగలరు ఒకరు ముందు మరొకరు వెనుక కానీ ఒక సైకిల్ పై తొమ్మిది మంది కూర్చోవడం ఎక్కడైనా చూశారా లేదు కదా అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్రమించాలని సుదీర్ఘ పనిగంటలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు.
అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. దీనితో భవిష్యత్ తరాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.
లవ్ టుడే సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది దిల్ రాజు టీమ్. ఈ ట్రైలర్ విడుదలతోనే మంచి సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలిస్తోంది.
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.