Home /Author Jyothi Gummadidala
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
దేశవ్యాప్తంగా వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ దీపావళి. ఈ పర్వదినాన దీపాలను వెలిగించడంతో పాటు, బాణాసంచా కాల్చడం అనాదిగా వస్తోందన్న అచారంగా చెప్పవచ్చు. అయితే బాణాసంచా కాల్చడం ఈ ఏడాది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు కఠిన ఆంక్షలను విధించింది.
తీసుకునే ఆహారం నుంచి చేసే ప్రతి పని మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కాలం మారేకొద్ది మనలో అనేక మార్పులు వస్తున్నాయి. చూస్తుండగానే శరీరంపై కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందులో సాధరణమైనవి కీళ్ల నొప్పులు, వెన్నెముక నొప్పి మొదలైనవి. స్కూల్ బ్యాగ్ మోసే పిల్లాడినుంచి వధ్దుల వరకు ఈ నొప్పులు సహజం. దీనిని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. మరి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలి, ఈ వ్యాధికి నివారణ ఏంటనే అంశాలను తెలుసుకుందాం.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా సంస్థ రిలీజ్ చేసింది. బాలయ్య షో కు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 'మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి బావా' అని చంద్రబాబును బాలకృష్ణ అడుగగా దీనికి చంద్రబాబు చెప్పిన సమాధానానికి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ చంద్రబాబు కూడా మోస్ట్ రొమాంటిక్ పర్సనే అనుకుంటారు.
ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా పాకిస్తాన్‌ను వరద ముంచెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పాక్‌లో వరద బీభత్సం సృష్టించింది. దానితో దాయాదీ దేశం ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది.
10 పూర్తి చేసిన నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోసుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సశస్త్ర సీమ బల్ (SSB) 2022 ఏడాదికి గాను తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్‌లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.
ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.