Home /Author Jyothi Gummadidala
మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్ వాచ్ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
ఎన్నికలు అన్నాక హామీలు ఉంటాయి. అయితే వాటికి కొంత వరకు నెరవేరుస్తుంటారు కొందరు. మరికొందరు ఎన్నో ఉచిత హామీలను ఇస్తాం అన్నీ నెరవేరుస్తామా ఏంటి అన్నట్టు ఉంటారు. అయితే ఈ తరహాలోనే హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విచిత్రమైన హామీలను ఇచ్చాడు. మరి అవేంటో చూసేయ్యండి.
నేడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు జరుగునుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీం ఇండియా రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పోయిందనుకున్న మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుంది. చైనాలో రోజురోజుకీ భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దానితో వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు పట్టణాల్లో లాక్డౌన్ విధించింది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్‌లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్రకెక్కింది.
రామాయణం ప్రకారం రావణాసురిడికి పది తలలు ఉంటాయని వినే ఉంటారు. కానీ మీకెప్పుడైనా సందేహం వచ్చిందా.. అసలు రావణుడికి పదితలలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఆ పది తలల వెనుకున్న కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు వీటన్నింటికి సమాధానం కావాలంటే ఈ కథనం చదివెయ్యండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియనివారుండరు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డార్లింగ్ కు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. అయితే ఈ మూవీ హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
రంగరంగ వైభంగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ కేతికా శర్మ.. ఉప్పెన హీరోతో జతకట్టి కుర్రకారును కళ్లు తిప్పకుండా చేసింది ఈ భామ. కాగా తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ నెట్టింట విడుదల చేసిన ఫోటోలకు కిర్రాక్ కేతికా అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.