Home /Author Jyothi Gummadidala
రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్ అయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలు నేపథ్యంలో కారు కమలం పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆ 18వేల కోట్లేదో మునుగోడు అభివృద్ధికి ఇస్తే మేం ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఉపఎన్నికలు రావడానికి ఒక కాంట్రాక్టర్ బలుపే కారణం అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు.
తమన్నా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. మిల్కీ బ్యూటీ అని పిలుచుకుని ఈ అందాల తారకు తెలుగు నాట అభిమానులు ఎక్కువే. పలు హిట్ చిత్రాలు నటింటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మరి ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ చూసేద్దామా.
సాధారణంగా బోరింగ్ అనగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం బక్కెట్ల కొద్దీ మద్యం వస్తుంది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగులోకి వచ్చింది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా మైదానంలో అదరగొట్టింది. సిరీస్ నెగ్గాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో భారత బౌలింగ్ దళం సపారీ జట్టుపై బంతులతో చెలరేగిపోయింది.
కొన్ని సంఘటనలు చూస్తే యువతరం ఎటుపోతుందో అనిపిస్తుంది. ప్రేమలు పెళ్లిళ్లు అనేవి నేటి యువతరానికి ఆశామాషీ వ్యవహారాల్లా మారిపోతున్నాయి. పాఠశాల చదువు పూర్తి కాకుండానే లవ్వులు ఏంటో.. ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? నేటి తరాన్ని చూస్తే నిజంగానే కలికాలం అనాల్సి వస్తుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓ స్కూల్ విద్యార్థినికి మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్ చేయనున్నట్టు పేర్కొనింది.
ఓ మైనర్‌పై బాలికపై కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు యువకులు విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.