Home /Author Jaya Kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన “పుష్ప” సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఈ వాన కబురుతో చల్లబడనున్నారు. కాగా రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఒక్కోసారి దారి తప్పుతున్న ఘటనలను ఇటీవల ఎక్కువగా గమనించవచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెప్పే పోలీసులు.. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి..
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నాడు. మోడల్, బాలీవుడ్ నటి హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016, నవంబరు 30న వీరి పెళ్లి జరగగా జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. కాగా ఇప్పుడు తన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్ గ్యాంగస్టర్ (వర్కింగ్ టైటిల్).
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
బులియన్ మార్కెట్లో గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 2 మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెట్టు కొమ్మను తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు