Home /Author Jaya Kumar
పెళ్లి సందD సినిమాలో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తనదైన శైలిలో దూసుకుపోతుంది.
హిందూ మత ఆచారాల్లో దీపానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ దీపాలు, ధూపం, కర్పూరంతో వారి ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. గుడిలో మీరు గమనించినట్లయితే దీప, ధూప నైవేద్యాలతో దేవుడికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారు కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 1 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (ఏప్రిల్ 1 ) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం […]
నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.
హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు తలారి గోవిందా రాజులు సమక్షంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో పైడికొండల వేంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐపీఎల్ 16 వ సీజన్ నేటి నుంచి షురూ కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్ గా అందర్నీ అలరించడంలో పక్కా అనేలా అన్ని టీమ్స్ సిద్దమవుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం నాటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆత్మహత్య ఆలోచనలు చేసినట్టు ఆఏ వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి మరణం తర్వాత తీవ్ర ఒత్తిడి లోనైనట్లు చెప్పిన ఆమె..
చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.
మన దేశం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఠక్కున అందరూ చెప్పే ఏకైక మాట "భిన్నత్వంలో ఏకత్వం". విభిన్న ప్రాంతాలు.. విభిన్న మతాలు.. విభిన్న ఆచారాలు.. ఇలా ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక్కటిగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాం. అదే విధంగా ఆహారం విషయంలో కూడా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి.