Home /Author Jaya Kumar
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్-1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ ఘోర ఘటన జరిగింది. తాజాగా నగరంలోని ఓ ప్రముఖ థియేటర్ లో గిరిజన తెగకు చెందిన వారిని లోపలికి అనుమతించక పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు థియేటర్ యాజమాన్యం వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. కళ అనేది ఎవరి సొత్తు కాదని..
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని సమాచారం అందుతుంది. శరత్ బాబు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఫిదా చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఇర్రుకుంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
తెలుగు వారి ఆత్మ నిలబెట్టడమే లక్ష్యంగా నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ "తెలుగుదేశం". 1982 మార్చి 29న పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆత్మగౌరవంతో.. ఢిల్లీ లోనూ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్.