Rashmika Mandanna: చీరకట్టులో శ్రీవల్లీ.. మేకప్ లేకపోయినా ఎంత అందంగా ఉందో చూడండి

అందాల భామ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

గతేడాది పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న రష్మిక.. ఈ ఏడాది ఛావా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఛావా హిట్ తో రష్మికను ఎవరు ఆపేలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది అని చెప్పొచ్చు.

ప్రస్తుతం తెలుగు , తమిళ్ సినిమాల్లో బిజీగా ఉన్న రష్మీక వరుస వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది.

మొన్నటికి మొన్న కన్నడ చిత్రోత్సవాలకు వెళ్లకుండా ఉండడంతో పాటు హైదరాబాద్ సొంత ఊరు అని చెప్పి షాక్ ఇచ్చింది రష్మిక. అప్పటి నుంచి కన్నడిగులు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు.

సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన్నా

నిత్యం ఏదో ఒక ఫోటోను సోషల్ మీడియా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ శ్రీవల్లి మేకప్ లేని ఫోటోలను షేర్ చేసింది.

చీరకట్టులో.. తానే మేకప్, హెయిర్ స్టైల్ చేసుకొని ఫ్రెండ్ తో ఫోటోలు తీయించుకున్నానని, ఇలా చేసినప్పుడు తనకు కాలేజ్ రోజులు గుర్తు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. మేకప్ లేకపోయినా నేషనల్ క్రష్ అందంతో అదరగొడుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.