Home /Author Chaitanya Gangineni
ఉచితంగా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14 తో గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూఐడీఏఐ ( భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసేందుకు అవకావం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేరు మంగళవారం హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 1 లక్ష తాకిన మొదటి స్టాక్ గా రికార్డు సృష్టించింది. మంగళవారం దలాల్ స్ట్రీట్ లో ఎంఆర్ఎఫ్ షేరు లక్ష మార్క్ ను దాటింది.
ఢిల్లీ కి చెందిన దేవయాని శర్మ.. మొదట మోడలింగ్ వైపు వెళ్లి పలు షోలతో ఇంప్రెస్ చేసింది. యాక్టింగ్ పై ఇంట్రస్ట్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2020లో భానుమతి రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దేవియాని. పూరీ ఆకాశ్ నటించిన రొమాంటిక్ లోనూ కనిపించింది. మహి రాఘవ దర్వకత్వంలో రీసెంట్ గా విడుదలైన ‘సేవ్ ద టైగర్స్ ’వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది దేవయాని శర్మ. త్వరలో ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను బయపెట్టేందుకు వస్తోంది. ఈ సిరీస్ కు కూడా మహి రాఘవనే డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 15 డిస్నీ + హాట్ స్టార్ లో ఈ సిరీస్ రాబోతుంది.
UPSC Notification: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 113 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు నుంచి ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం జూన్ 29 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పించారు. పోస్టుల వారీ దరఖాస్తు […]
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
తెలంగాణ లో గ్రూప్ 1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం (జూన్ 11) ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.