Home /Author anantharao b
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెనతోనే తన సత్తాను నిరూపించుకున్నాడు, అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కృతితో రొమాన్స్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌గా మార్చాయి. ఇప్పుడు మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 43,000 దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్కదానికి రూ.60,000 ప్రకటించారు. అయితే ప్రకటన వెలువడిన వెంటనే ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు పిల్లు దాఖలయ్యాయి.
లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ 100 కోట్ల రూపాయలతో ప్రసిద్ధి చెందిన హెచ్145 ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. లులు గ్రూప్ భారతదేశంలో మరియు విదేశాలలో అనేక ప్రధాన నగరాల్లో అనేక మాల్స్‌ను కలిగి ఉంది. బుధవారం కొత్త హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది.
ప్రజలు తమ వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన దినంగా జరుపుకోవాలని కలలు కంటారు. దీనికోసం కొందరు విలాసవంతమైన పార్టీలు చేస్తారు. మరికొందరు ఆకర్షణీయమైన దుస్తులను ధరిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్‌ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) చైర్మన్‌గా సమీర్ వి కామత్‌ను నియమించారు. డిఆర్డిఓలో నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కామత్, జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారు.
ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల నిర్మాణ వ్యయంమొత్తం రూ.70 కోట్లు. అయితే, దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ దాఖలైన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. 2007లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలైంది.
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఉచిత ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు, ఆ అంశాన్ని శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించింది. విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం "ఎన్నికల ప్రజాస్వామ్యంలో, నిజమైన అధికారం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.