Home /Author anantharao b
విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం మొదట జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో లీక్ అయిందని తరువాత బీహార్ వెళ్లిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) తెలిపింది. బీహార్‌లో మొదట ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మొదట భావించారు. పేపర్ లీక్ కు సంబంధించి పలువురిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు.
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.
ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతలతండాలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్‌గఢ్‌లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .
దక్షిణ గాజాలోని పాఠశాల వెలుపల శరణార్దుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 29 మంది మరణించగా పలువురు గాయపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ నగరానికి తూర్పున ఉన్న అబాసన్ అల్-కబీరా పట్టణంలోని అల్-అవుదా పాఠశాల గేటు పక్కన మంగళవారం ఈ దాడి జరిగిందని గాజా హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీచార్జ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.