IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసెపట్లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలోని ఎర్రమట్టి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. దీంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. బౌండరీలు చిన్నగా ఉండటం కూడా ఇందుకు కలిసొస్తుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి, ఒక మ్యాచ్‌లో నెగ్గి మరో దాంట్లో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఆరో స్థానంలో ఉంది. ముంబయి ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పదో స్థానానికి పరిమితమైంది.
ముంబయి జట్టు : రికెల్టర్ విల్ జాన్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేష్ పుతుర్ ఉన్నారు.
కేకేఆర్ జట్టు : క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్‌రాణా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.