Home /Author anantharao b
చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు
తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో . కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమయింది.
కేరళను "డ్రగ్స్ రాజధాని"గా మారుస్తున్నారని,రాష్ట్ర ఆదాయానికి రెండు ప్రధాన వనరులు లాటరీ మరియు మద్యం అయినందుకు సిగ్గుపడుతున్నట్లు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో తన ఇంట్లో ఈ ఏడాది దీపావళి జరుపుకుంటానని చెప్పారు.
మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు.