Last Updated:

Shivraj Singh Chouhan : కోవిడ్ అనాధలతో దీపావళి జరుపుకోనున్న మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో తన ఇంట్లో ఈ ఏడాది దీపావళి జరుపుకుంటానని చెప్పారు.

Shivraj Singh Chouhan : కోవిడ్ అనాధలతో దీపావళి జరుపుకోనున్న మధ్యప్రదేశ్ సీఎం  చౌహాన్

Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో తన ఇంట్లో ఈ ఏడాది దీపావళి జరుపుకుంటానని చెప్పారు. ఈ రోజు ధంతేరస్. రేపు చతుర్దశి సందర్భంగా, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన నా కొడుకులు, కుమార్తెలు, మేనల్లుడు మరియు మేనకోడళ్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటాను అని సీఎం చౌహాన్ తెలిపారు.

వారితో కలిసి పండుగ జరుపుకోవడం, వారితో ఆనందం పంచుకోవడం ఆనందంగా ఉంది. భోపాల్‌తోపాటు సమీప ప్రాంతాలకు చెందిన చిన్నారులు దీపావళి పండుగను ఇక్కడే భోపాల్‌లో జరుపుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులకు ఈ పండుగ చేసుకునేందుకు సహకరించాలని కలెక్టర్‌కు సూచిస్తున్నాం.వారికి బహుమతులు అందించి, వారితో ఆనందాన్ని పంచుకోండి. నా కొడుకులు, కూతుళ్లందరికీ దీపావళి శుభాకాంక్షలు. చింతించకండి. మామా వారితో ఉన్నారు” అని చౌహాన్ అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ధన్‌తేరస్‌ రోజున ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లలోకి 4.5 లక్షల మంది ప్రవేశిస్తారని సీఎం చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి ఆశీస్సులు పొందుతున్నందున ఈ రోజు మనందరికీ చాలా పెద్ద రోజు అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: