Home /Author anantharao b
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 26 పార్టీలు నగరంలో తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం అయ్యారు.
చాలా యూనివర్శిటీలు ఇపుడు 12 వ తరగతి తరగతి తరువాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో బీఎస్సీప్లస్ ఎమ్మెస్సీ, బిటెక్ ప్లస్ ఎంటెక్ తదితర కోర్సులు ఉంటున్నాయి. ఈ కోర్సులు చేయడం మంచిదేనా ? అయితే ఈ కోర్సులు చేద్దామనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్.
రేపు జరగబోయే ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రైమ్9తో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తోపాటుగా ఎన్డి పాలసీలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నదానిపై చర్చించే అవకాశాలున్నాయన్నారు. ఏపీ ఎన్నికలపై కూడా ఎన్‌డిఎ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారు.
ఈ సంవత్సరం కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర చేసిన యాత్రికుల సంఖ్య గత 16 రోజుల్లో 2,29,221కి చేరింది,.ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆదివారం 20,806 మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
జనసేన కార్యకర్తలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని యూట్యూబర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రూ.24 లక్షల నగదు దొరికింది. విచారణలో ఉన్న తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడని మరియు దాదాపు రూ.1 కోటి సంపాదించాడని అధికారులు తెలిపారు.
స్కాట్లాండ్ దీవిలోని సముద్రతీరంలో చిక్కుకున్న 50 పైలట్ తిమింగలాలు చనిపోయాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు, సముద్ర రక్షకులు లూయిస్ ద్వీపంలోని నార్త్ టోల్స్టాలోని ట్రైగ్ మోర్ వద్దకు చేరుకున్నారు. వారు డజన్ల కొద్దీ పైలట్ తిమింగలాలు ప్రాణాపాయస్దితితో ఉన్నట్లు గుర్తించారు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
భారీ వర్షాల నేపధ్యంలో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భీమ్‌గోడ బ్యారేజీ యొక్క ఒక గేటు దెబ్బతింది. దీనితో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.హర్ కి పౌరి ఘాట్ సమీపంలోని భీమ్‌గోడ బ్యారేజీ యొక్క స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో హరిద్వార్‌లోని గంగలో నీటి మట్టం ఆదివారం హెచ్చరిక స్థాయి 293 మీటర్లకు చేరుకుంది. అధికారులు హై అలర్ట్ జారీ చేసి, దిగువన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.