Home /Author anantharao b
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడిని తన దూరపు బంధువును ప్రేమిస్తున్నాడని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. బాధితుడిని శశాంక్‌గా గుర్తించారు. కాలిన గాయాలతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోజురోజుకు టమోటా ధరలు పెరిగిపోతుండడంతో విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమోటా దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు అనకాపల్లి లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. పొన్ముడి తనయుడు, లోక్‌సభ ఎంపీ గౌతం సిగమణిపై కూడా సోదాలు జరుగుతున్నాయి
ఢిల్లీలో అధికారుల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది, ఇది సానుకూల పరిణామం' అని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. దీనిపై , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ,వారు (ఆప్) రేపు సమావేశంలో చేరబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆర్డినెన్స్ విషయానికొస్తే, మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది.
ఆదివారం ఫారో దీవుల్లో దాదాపు 80 పైలట్ తిమింగలాలను సామూహికంగా చంపిన ఘటనను చూసిన ప్రయాణికులకు బ్రిటిష్ క్రూయిజ్ లైన్ క్షమాపణలు చెప్పింది. అంబాసిడర్ క్రూయిస్ లైన్ ప్రయాణీకులు రాజధాని టోర్షావ్న్ లోని ఓడరేవుకు చేరుకున్నారు. అక్కడ సంప్రదాయ వేటగాళ్ళు మోటర్బోట్లు మరియు హెలికాప్టర్‌ను ఉపయోగించి సమీపంలోని బీచ్‌లో తిమింగలాలను కొక్కాలతో లాగి, వాటిని బంధించి కత్తులతో చంపారు.
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు రిటైల్ మార్కెట్లలోని ఇతర ప్రదేశాలలో తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి రాయితీతో కూడిన టమోటాల ధరను కిలోకు రూ.90 నుండి రూ.80కి తగ్గించింది. దేశంలోని 500 పైగా ప్రదేశాల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత టమోటాల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆధార్ కార్డ్ భారతదేశంలో ముఖ్యమైన పత్రం, బ్యాంక్ లావాదేవీలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, పాఠశాల అడ్మిషన్లు మరియు ఉద్యోగ ధృవీకరణలు వంటి వివిధ ప్రయోజనాల కోసం అవసరం. అది లేకుండా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేము. అయితే, కార్డుపై ఉన్న ఫోటో పట్ల తమకున్న అసంతృప్తి కారణంగా చాలా మంది వ్యక్తులు తమ ఆధార్ కార్డును బహిరంగ ప్రదేశాల్లో చూపించడానికి ఇబ్బంది పడటం లేదా వెనుకాడుతున్నారు.
ఆఫ్రికా మరియు అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్య సంక్షోభం కారణంగా ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో భారతదేశం నుండి ఆటోమొబైల్ ఎగుమతులు 28 శాతం తగ్గిపోయాయి. జూన్ 30, 2023తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మొత్తం ఎగుమతులు 10,32,449 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 14,25,967 యూనిట్లు ఉన్నాయి.
ఇంటర్ లో ఫస్టియర్ ఎంపీసీ చదివిన తరువాత సెకండియర్ లో బైపీసీ కి మారవచ్చా? లేకపోతే బైపీసీ చదివి మరలా ఎంపీసీకి మారవచ్చా? అంటే మారవచ్చనే అంటున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్. అయితే ఇది కేవలం సీబీఎస్ఈ లో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.