Published On:

Champion Glimpse: రోషన్ బర్త్ డే స్పెషల్.. ఛాంపియన్ గ్లింప్స్ చూశారా.. ?

Champion Glimpse: రోషన్ బర్త్ డే స్పెషల్.. ఛాంపియన్ గ్లింప్స్ చూశారా.. ?

Champion Glimpse: సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారి.. మహిళా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక జనరేషన్ మారేకొద్ది.. హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ తో రీఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక అఖండ సినిమాతో మరోసారి తన విలనిజాన్ని బయటపెట్టి.. ప్రస్తుతం స్టైలిష్ విలన్ గా కూడా బిజీగా మారాడు.

 

ఇక శ్రీకాంత్ నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ .. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక హీరోగా పెళ్లి సందD సినిమాతో పరిచయం అయ్యాడు..తన తండ్రి నటించిన పెళ్లి సందడి న్యూ వెర్షన్ గా ఈ సినిమా తెరకెక్కింది. రాఘవేంద్రరావు సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ ..తండ్రి శ్రీకాంత్ ను గుర్తుచేశాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

ఇక పెళ్లి సందD సినిమా తరువాత ఆచితూచి అడుగులు వేస్తున్న రోషన్.. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న వృషభ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వృషభ కాకుండా రోషన్ తెలుగులో నటిస్తున్న చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక నేడు రోషన్ పుట్టినరోజు కావడంతో.. ఛాంపియన్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ లో రోషన్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. గ్రౌండ్ లో ఎలా అయితే ఆడతాడో.. బయట విలన్స్ తో కూడా అతను ఫుట్ బాల్ ఆడుతున్నట్లు కనిపించాడు.

 

రోషన్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. లవర్ బాయ్ లా ఉన్నా కూడా ఫేస్ లో రఫ్ నెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.