Home /Author anantharao b
ఎల్ సాల్వడార్ ఆఫ్రికా లేదా భారతదేశం నుండి వచ్చే ప్రయాణీకుల నుంచి $1,000 రుసుమును వసూలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ కు వలసలను అరికట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
విదేశీ నిపుణులకు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో తమ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట నిచ్చే వార్త. అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక దశలో ఎంప్లాయ్ మెంట్ అధరైజేసన్ కార్డ్ మరియు ఇతర అవసరమైన ప్రయాణ పత్రాలను జారీ చేయాలని వైట్ హౌస్ కమిషన్ సిఫార్సు చేసింది.
: అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదని, వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.
గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన మూడు పేజీల లేఖని జైలు అధికారుల ద్వారా ఎసిబి కోర్టు న్యాయమూర్తికి పంపించారు.
నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. తాను సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీచేస్తానని అన్నారు. గతంలో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తనపై పోటీకి రాలేదు కాబట్టే నేను సిద్ధం అన్నారు.
ఇండియాకు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం మూతపడిన అల్ దహురా కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులకు పాత్రకు సంబంధించి కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది.
రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.