Home /Author anantharao b
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ శనివారం గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్ మరియు గోద్రా జిల్లాల్లో విస్తరించి ఉన్న అనుమానితుల ప్రాంగణంలో ఉదయం ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ చనిపోయారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్సులో హైదరాబాద్ కి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ష్యోక్ నదిని దాటుతుండగా T72 ట్యాంక్ కొట్టుకుపోవడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటిమట్టం పెరగడం వల్ల ట్యాంక్ మునిగిపోయిందని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది
తమిళనాడు రాష్ట్రానికి నీట్ పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని , 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవితను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం కలిశారు.ఈ సందర్బంగా ఆమె యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్బంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీసినట్లు సమాచారం.