Home /Author anantharao b
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో పోటీదారులందరిలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అధికారుల ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు, తన భార్య లక్ష్మికి రూ.458.37 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె పక్కన సోదరుడు తప్ప మరెవరూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయకుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంతకన్నా లేరు.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. గత ఏడాది దీపావళి సందర్భంగా 15.76 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. ఈసారి, మరో రికార్డు సాధించడానికి 51 ఘాట్లలో దీపాలు వెలిగించబడతాయి.
దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను యూఎస్ ఆరోగ్య అధికారులు గురువారం ఆమోదించారు. ఐరోపాకు చెందిన వాల్నెవా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఇక్స్ చిక్ పేరుతో విక్రయించబడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ)తెలిపింది.
పాకిస్థాన్ పౌరులు లామినేషన్ పేపర్ కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ & పాస్పోర్ట్స్ (DGI&P) ప్రకారం, పాస్‌పోర్ట్‌లలో ఉపయోగించే లామినేషన్ పేపర్ ఫ్రాన్స్ నుండి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దాని కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లు నిలిచిపోయాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని శుక్రవారం బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో స్థానిక ప్రత్యర్థి గ్రూపుల హస్తం మరియు ఎల్ఇటిలోని అంతర్గత పోరు వుందని పాకిస్తాన్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. నేటి విచారణకి అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు ప్రత్యేక పిపి వివేకానంద తెలిపారు.
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై వేటు పడింది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.