Home /Author anantharao b
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్‌పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందించాలని డిమాండ్ చేశారు.
:కెనడా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణను పునరుద్ఘాటించారు తమ దేశం ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన కోసం నిలబడుతుందని అన్నారు.
గాజా ఆసుపత్రిలో సుమారు 1,000 మంది వ్యక్తులను మరియు రోగులను బందీలుగా ఉంచి, వారిని తప్పించుకోవడానికి అనుమతించని ఒక సీనియర్ హమాస్ కమాండర్‌ను వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
దీపోత్సవం యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోవడంతో సుమారుగా 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.నేషనల్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలే మరియు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దేశం పట్ల వారి త్యాగం మరియు అంకితభావానికి వారిని కొనియాడారు. వీరులకు భారతదేశం కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని అన్నారు. హిమాచల్‌లో బలగాలతో గడిపిన సమయం లోతైన భావోద్వేగం మరియు గర్వంతో నిండి ఉందని చెప్పారు.
దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీప జ్యోతి.. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.
హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్‌కి బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వాన్ని సాగనంపడానికి తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.