Home /Author anantharao b
చెన్నై నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించవలసి వచ్చింది. రైలు జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి మరణించినా రైల్వే అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ పరిస్దితి తలెత్తింది.
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతుంది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో మంగళవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మధ్య అనూహ్య భేటీ జరిగింది. వీరిద్దరూ ప్రార్థనల కోసం కొండపైనున్న ఆలయానికి వెళ్లినపుడు అనుకోకుండా కలసుకున్నారు.
: జనాభా నియంత్రణలో మహిళల విద్య కీలకపాత్ర వహిస్తుందంటూ బీహార్ సీఎం, జెడి(యు) నేత నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడంతో బుధవారం బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కెన్యా మరియు సోమాలియాలో భారీ వర్షాలు మరియు ఆకస్మిక వరదలు కనీసం 40 మంది మరణించగా వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సహాయ సంస్థలు సోమవారం నివేదించాయి.సోమాలియాలో వరదల కారణంగా సుమారుగా 25 మంది మరణించారు.
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.
ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆలంపూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి స్థానంలో కొత్త యాప్ తీసుకొస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఇరాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గిస్ మొహమ్మది సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆమె ఈ దీక్షను ప్రారంభించారు.
ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఇజ్రాయెల్‌పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నయుద్ధం క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.