Home /Author anantharao b
రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా రాత్రి జరిగిన తొక్కిసలాటలో 37 మంది యువకులు మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.గత వారం సైన్యం 18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,500 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటలీ ట్రిబ్యునల్ సోమవారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమూహాలలో ఒకటైన ఇటలీలోని ndrangheta లో సభ్యత్వం కలిగిన 207 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 2,100 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మరో 131 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి కఠినవ్యాఖ్యలు చేసింది రైతులను విలన్లుగా చేసి తమ మాట వినడం లేదని చెప్పింది. పంట వ్యర్దాలను తొలగించడాన్ని పంజాబ్ ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
9,000 కోట్ల మేరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బైజూకి షోకాజ్ నోటీసు పంపింది. బైజూస్ మరియు థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బైజు రవీందరన్‌కు నోటీసు పంపబడింది.
ముంబైలో జరిగిన 26/11 దాడుల 15వ వార్షికోత్సవానికి ముందు ఇజ్రాయెల్ మంగళవారం పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాను 'ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చింది. ముంబై ఉగ్రదాడుల జ్ఞాపకార్థం 15వ సంవత్సరానికి గుర్తుగా, ఇజ్రాయెల్ రాష్ట్రం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చినట్లు న్యూ ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలుచున్న అభ్యర్దులందరిలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డని వార్తలు వచ్చాయి. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేకానంద నిలిచారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.
ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశాన్నీ ఇద్దరూ వదులుకోవడం లేదు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.