Home / ఆంధ్రప్రదేశ్
Minister nara lokesh on manyam district school students: ఓ సామాన్యుడు చేసిన ట్వీట్ కు స్పందించారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ MLA.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్‌గా MEO, HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను […]
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ సమావేశం పూర్తైన తర్వాత సీఎం ప్రస్తావించారు. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు. రప్పా..రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని పలువురు మంత్రులు అన్నారు. రప్పా.. రప్పా వంటి […]
Police Notices to YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీచేశారు. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందపడి దుర్మరణం చెందాడు. ఘటనలో గుంటూరు పోలీసులు జగన్‌తోపాటు ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్‌ను ఏ2గా, కారు యజమాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను […]
Former Minister Taneti Vanitha On TDP Govt: కూటమి ప్రభుత్వంలో ఏపీలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని ఆమె విమర్శించారు. ఏపీలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదని ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవన్నారు. వాళ్లు మాట్లాడిన మాటలకు […]
Polavaram-Banakacharla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలను నివృత్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, నేతలకు సూచించారు. ప్రాజెక్టు ద్వారా వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం […]
YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల స్పందించారు. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణించడం తప్పని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. కానీ జగన్ దానిని ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమని తెలిపారు. […]
Another Case Filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై సైతం కేసు ఫైల్ అయింది. అనుమతి లేకుండా మిర్చి యార్డులో హంగామా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబుతో పాటు పలువురికి నోటీసులు […]
Deputy CM Pawan Kalyan Mother Anjana Devi Illness: ఏపీలో అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కాసేపటికే పవన్ కల్యాణ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవికి అస్వస్థత ఉందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే సీఎం చంద్రబాబుకు తన తల్లి అంజనా దేవికి అనారోగ్యం ఉందని […]
Lady Jump into Well with Children in Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కూతురు, కుమారుడితో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి, కుమారుడు మృతిచెందారు. కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవాణిపాలెం గ్రామానికి […]
Chandrababu AP Cabinet Meeting in Amaravathi: ఏపీ చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 31 ప్రతిపాదనలతో పాటు రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆమోదం తెలిపిన ప్రతిపాదనలు, విశాఖలో కాగ్నిజెంట్‌కు భూముల కేటాయింపులు, అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేయడం, రాష్ట్రంలో పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం సహా పలు అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది. విశాఖలో దిగ్గజ […]