Home / ఆంధ్రప్రదేశ్
Tirumala: హైదరాబాద్ కు చెందిన సునీత దేవి, టి. కనకదుర్గ ప్రసాద్ అనే దంపతులు తాము నివసిస్తున్న ఇంటిని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి. సునీత దేవి, టి. కనకదుర్గ ప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు. హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ శ్రీ భాస్కర్ రావు ఇటీవల […]
Tirumala : శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ (TTD) ప్రకటించింది. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి, ఆగస్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. 7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు, 8న ఆళ్వందార్ల వర్ష తిరు నక్షత్రం, 9న శ్రావణ పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగస్టు 10న తిరుమల శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు, ఆగస్టు […]
Civil Supplies Minister Nadendla Manohar: రాష్ట్ర ప్రగతిలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం 60 శాతం రేషన్ కార్డులకు సహాయం అందిస్తోందన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులు వచ్చాయని తెలిపారు. కోటి 45 లక్షల 97 వేలకు పైగా కార్డులు ప్రస్తుతం […]
YS Jagan Gets Big Relief in Saraswati Power Ltd Case: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం కొంతకాలంగా నడుస్తోంది. జగన్, షర్మిల.. తల్లి వైఎస్ విజయమ్మ మధ్య సరస్వతీ పవర్ సహా పలు ఆస్తుల యాజమాన్యంపై భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆస్తుల వివాదంలో ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ […]
AP Government Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. ఈ పథకం కింద ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఏపీ ఆర్టీసీకి సుమారు 11వేల బస్సుల సముదాయం ఉంది. ఇందులో 70 శాతం కంటే ఎక్కువ నాన్-ఏసీ సాధారణ బస్సులు ఉన్నాయి. దీంతో ఈ పథకానికి దాదాపు 74 శాతం బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత […]
CM Chandrababu: సింగపూర్ పర్యటనలో మూడో రోజు సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఆ దేశ పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఫిన్టెక్, పరిశ్రమలు, ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. […]
Varalakshmi Vratham: తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో సోమవారం జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుత.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, […]
CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఏపీ రైట్ ఛాయిస్ అని, సేఫ్ ప్లేస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులు పెట్టండి, పేదలకూ సాయం చేయండని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్ నుంచే వస్తున్నాయి. 1947లోనే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే.. భారత్ ఇప్పుడు మరోలా ఉండేది. భారత్ 1991లో ఆర్థిక […]
AP Byelections Notification Released: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉపఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెపథ్యంలో జూలై 30నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగష్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆగస్టు 10న, ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఈ […]
Vangalapudi Anitha: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి వంగల పూడి అనిత ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారని విమర్శించారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన్ వాళ్లనే టచ్ చేశారని అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో మంత్రి అనిత పర్యటించారు. ఉప్పుటేరు వంతెన వద్ద అనితకు ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం […]