Last Updated:

DJ Tillu 2 : సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

DJ Tillu 2 : సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

DJ Tillu 2 : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

గతేడాది రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీ పరంగా చాలా ఆకట్టుకుంది. ఈ మూవీలోని డైలాగ్, సిద్ధూ జొన్నలగడ్డ అటిట్యూడ్, మ్యూజిక్, రొమాంటిక్ అంశాలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతోనే సిద్ధూ, నేహా కెరీర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. తొలుత సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.

కాగా ఇప్పుడు తాజాగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘టిల్లు స్క్వేర్’ను ప్రపంచ వ్యాప్తంగా 2024 ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో పంచెకట్టులో సిద్ధూ మాంచి స్టైలిష్ గా కనబడుతున్నాడు. ఇప్పటికే వదిలిన ‘ఫస్ట్ సింగిల్’, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇంకాస్తా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏమేరకు మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.