Last Updated:

AP Inter Results : ఏపీలో ఇంటర్ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలు రిలీజ్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్‌ ఆఫ్‌ బర్త్‌, రోల్‌ నెంబర్‌, రిసిప్ట్‌ నెంబర్‌ వంటి వివరాలను

AP Inter Results : ఏపీలో ఇంటర్ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలు రిలీజ్..

AP Inter Results : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్‌ ఆఫ్‌ బర్త్‌, రోల్‌ నెంబర్‌, రిసిప్ట్‌ నెంబర్‌ వంటి వివరాలను అందించడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు.

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే (AP Inter Results)..

ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ -https://bie.ap.gov.in/ ను సందర్శించాలి.

తర్వాత అక్కడ హోంపేజీలో కనిపించే ‘Recounting(RC)& Reverification(RV) Results’ ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

లాగిన్ పేజీలో అభ్యర్థులు విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రశీదు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.

తర్వాత ‘Results’ బటన్‌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఫలితాల కాపీని ప్రింట్ లేదా స్క్రీన్ షాట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఏమైనా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కి కాల్ చేయాలని కోరారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఏడాది 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఫలితాల్లో మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.