Ycp Leaders Phone Tapping : అనుపమ పెద్దిభొట్ల ఎవరు? ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? AP ఇంటెలిజెన్స్ చీఫ్‌దేనా?
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
Ycp Leaders Phone Tapping : ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
ఈ మేరకు తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘాపెట్టారు.
అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా.
నా ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు.
(Ycp Leaders Phone Tapping) అనుపమ పెద్దిభొట్ల ఎవరు?
తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి. సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేశారు.
నాఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారు.. అందుకు గాను ఆడియో కూడా పంపారు. అని చెప్పడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుంది.
కాగా 98499 66000 నుంచి సీతారమంజనేయులు ఫోన్ చేశారు. ఇది ఆయన నెంబర్. కావాలంటే చెక్ చేసుకోండి అని కూడా వ్యాఖ్యానించడం మరింత దుమారాన్ని లేపుతుంది.
ఈ తరుణంలోనే ఈ నెంబర్ ఎవరిది అని అందరూ సెర్చ్ చేస్తున్నారు.
కాగా ఈ నెంబర్ ని సెర్చ్ చేస్తుండగా ఆ నెంబర్ “అనుపమ పెద్దిభొట్ల” అనే మహిళా పేరు మీద ఉన్నట్లు తెలుస్తుంది .
దీంతో అసలు ఈ అనుపమ పెద్దిభొట్ల ఎవరూ ? ఆమెకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి. సీతారామాంజనేయులు సంబంధం ఏంటి అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
అసలు ఈ నెంబర్ ఐ.జి. సీతారామాంజనేయులుకి చెందిన దేనా కాదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
మరి ఈ విషయం మీద సీతారారామాంజనేయులు ఏమని స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
అంతకు ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు.
అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు.
నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు అని బాధపడ్డారు.
నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుంది.
నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు.
పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు.
బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ అయిండొచ్చు.
మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది.’’ అంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/