Last Updated:

Rare Green Comet: 50 వేల ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. భూమికి దగ్గరగా రానున్న ఆకుపచ్చని తోకచుక్క

ఆకాశం అంటేనే అద్భుతం. ఆ అనంత విశ్వంలో అంతుచిక్కని అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. అద్భుత దృశ్యాలెన్నో ఆకాశంలో కనిపిస్తుంటాయి.

Rare Green Comet: 50 వేల ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. భూమికి దగ్గరగా రానున్న ఆకుపచ్చని తోకచుక్క

Rare Green Comet: ఆకాశం అంటేనే అద్భుతం. ఆ అనంత విశ్వంలో అంతుచిక్కని అద్భుతాలు ఇమిడి ఉన్నాయి.

లక్షలాది నక్షత్రాలు, తోక చుక్కలు, ఇతర గ్రహాలు, చంద్రుడు.. ఇలాంటి అద్భుత దృశ్యాలెన్నో ఆకాశంలో కనిపిస్తుంటాయి.

తాజాగా ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. 50 ఏళ్ల క్రితం.. అంటే ఆదిమానవుల కాలంలో కనిపించిన ఓ తోకచుక్క మళ్లీ మనల్ని పలకరించనుంది.

తర్వాత  ఫిబ్రవరి 2 న భూమికి అతి సమీపంలోకి వస్తోంది. అది భూమికి కేవలం 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

టెలిస్కోప్ లేకుండానే ఈ తోకచుక్క( Rare Green Comet) ను చూడొచ్చని.. సూర్యోదయం ముందు ఇది స్పష్టంగా కనిపిస్తుందని నాసా(NASA) చెబుతోంది.

 

అసలేంటీ గ్రీన్ కామెట్

తొలిసారిగా జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ (జెడ్ టీ ఎఫ్)2022, మార్చిలో ఈ తోక చుక్కను గుర్తించారు. దీనికి శాస్త్రవేత్తలు C/2022E3(ZTF)గా పేరు పెట్టారు.

అందుకే ఈ తోకచుక్క చివర జెడ్ టీఎఫ్ ను పెట్టారు. ఈ తోకచుక్కలో డయాటోమిక్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది.

సూర్యుడి అతినీల లోహిత కిరణాల వల్ల డయాటోమిక్ కార్బన్ ఆకుపచ్చని కాంతిని పొందుంది. కాబట్టి ఈ తోకచుక్కను గ్రీన్ కామెట్ ( Rare Green Comet) అని పిలుస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ తోకచుక్క మధ్యభాగం ఆకుపచ్చగా, తోక బూడిదరంగు, పొడవుగా సాగే తోక చివరి భాగం.. ఇలా అన్నీ కలిసి అద్భుత దృశ్యంగా కనువిందు చేయనుంది.

అయితే ఆ తోకచుక్క భూమికి సమీపంలోకి రాగానే ఈ ఆకుపచ్చ తోకచుక్కలోని హిమపదార్థం మండటంవల్ల దాని వెనుక తెల్లని రంగులో పొడవైన తోక ఏర్పడుతుందని తెలిపారు.

Green Comet 2023: Rare shooting star to make first appearance after 50,000 years — Check date, visible time, where to view

(జనవరి 21 న టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిత్రాన్ని తీశారు)

 

ఎప్పుడు చూడొచ్చు

సూర్యుడి బాహ్యకక్ష్యలో పరిభ్రమించే ఈ ఆకుపచ్చ తోకచుక్క సూర్యుడి చుట్టూ ఒకసారి చుట్టి రావడానికి 50 వేల సంవత్సరాలు పడుతుంది.

అందుకే ఇది భూమికైనా, సూర్యుడికైనా 50 వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేరువగా వస్తుంది.

సూర్యుడి సమీపంగా వచ్చినప్పుడే, భూమికి కూడా సమీపం నుంచి వెళ్తుంది.

ఈ తోకచుక్క 2023 జనవరి 12 సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఫిబ్రవరి 2న ఈ తోకచుక్క భూమికి అత్యంత సమీపంలో ఉంటుందని, ఫిబ్రవరి 10 నుంచి 12 మధ్య అంగారక గ్రహానికి చేరుకుంటుందని

శాస్త్రవేత్తలు తెలిపారు. వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలే తోకచుక్కలని సైంటిస్టులు చెబుతున్నారు.

అవి దాదాపు ఒక నగరమంత వ్యాసంతో ఉంటాయని తెలిపారు.

సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన కాంతితో బయటకు వెదజల్లుతాయన్నారు.

తోక చుక్కల ద్వారా భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చన్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/