Last Updated:

Minister Dharmana : విశాఖను రాజధాని చేయాలి… లేకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి : మంత్రి ధర్మాన

Minister Dharmana : విశాఖను రాజధాని చేయాలి… లేకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి : మంత్రి ధర్మాన

Minister Dharmana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ మరింత ముదురుతుంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగా నైనా ప్రకటించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక, విభజనతో విడిచిపెట్టి వచ్చామని.. ఇదే పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక వైపు ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అధికారంలోని వైకాపా మాత్రం మూడు రాజధానులను కొనసాగించలంటూ పట్టుబట్టింది. ఈ తరుణంలోనే కోర్టు కేసులు, వివాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన విషయం కూడా తెలిసిందే. పార్లమెంటు లో కూడా పలు మార్లు కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జరుగుతుందని వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

అదే విధంగా ధర్మాన మాట్లాడుతూ… మూడు రాజధానులు లేకపోతే… హైదరాబాద్ తరహా పరిస్థితులు రిపీట్ అవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఎలా కట్టుబట్టలతో ఏపీకి వచ్చామో, అలాంటి పరిస్థితితే భవిష్యత్తులో రావొచ్చన్నారు. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రను మధ్యలో వదిలేయడం పట్ల ధర్మాన సెటైర్లు వేశారు. అరసవల్లికి వస్తామని చెప్పి చివరికి ఢిల్లీ వెళ్లిపోయారని… హైకోర్టు ఆధార్ కార్డులు అడగటం వల్లే యాత్రను మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని ధర్మాన ఆరోపించారు. నిజమైన రైతులే అమరావతి పాదయాత్రలో పాల్గొని ఉంటే ఆధార్ కార్డులను ఎందుకు చూపించలేకపోయారని నిలదీశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని… రాజధాని ఏర్పాటుతో ప్రైవేటు సంస్థలు, పెట్టుబడులు భారీగా వస్తాయని… భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం పొన్నాడ నుంచి బొంతలకోడూరు వరకు రూ.4.98 కోట్లతో నిర్మించిన బీటీరోడ్డును మంత్రి ధర్మాన శుక్రవారం ప్రారంభించారు. తెదేపా అధినేత చంద్రబాబు మతిభ్రమించి ‘బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి: