World Car of the Year: వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్.. నంబర్ వన్ కారుగా బీవైడీ సీగల్..!

World Car of the Year: ప్రపంచంలో వేల సంఖ్యలో ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి, ఇవి మార్కెట్లో ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కార్లను తయారు చేస్తున్నాయి. సంస్థ నైతికతను పెంచడానికి అవార్డులు కూడా ఇస్తున్నారు. దీని కోసం,జనవరి 2025లో వరల్డ్ కార్ అవార్డ్స్ టాప్పీ గౌరవం కోసం 10 మంది ఫైనలిస్టుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో బీఎమ్‌డబ్ల్యా X3, క్యాప్సప్ ఎలక్ట్రిక్/హ్యుందాయ్ ఇన్‌స్టర్,కియా EV3 టాప్-3లోకి ప్రవేశించగలిగాయి. ఈ అవార్డుల జ్యూరీ సభ్యులలో 30 విభిన్న దేశాలకు చెందిన 96 మంది ప్రముఖ ఆటో జర్నలిస్టులు ఉన్నారు.
2025 World Urban Car of the Year list
1. బీవైడీ సీగల్/డాల్ఫిన్ మినీ
2. హ్యుందాయ్ ఇన్‌స్టర్ / కాస్పర్ ఎలక్ట్రిక్
3. మినీ కూపర్ ఎలక్ట్రిక్
2025 సంవత్సరానికి వరల్డ్ కార్ అవార్డ్స్ బీవైడీ సీగల్ / డాల్ఫిన్ మినీని వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ కోసం నంబర్ వన్‌గా ఎంపిక చేసింది, అయితే ఈ జాబితాలో హ్యుందాయ్ ఇన్‌స్టర్ / కాస్పర్ ఎలక్ట్రిక్ రెండవ స్థానంలో ఉంది.మినీ కూపర్ ఎలక్ట్రిక్ మూడవ స్థానంలో నిలిచింది.
BYD Seagull car
చైనీస్ కారు BYD సీగల్ ఈ సంవత్సరం వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ కారు పొడవు 3780 మిమీ, వెడల్పు 1715 మిమీ, ఎత్తు 1540 మిమీ. ఈ కారు వీల్‌బేస్ 2500 మిమీ. ఈ కారులో, వీల్ కవర్‌తో కూడిన 15-అంగుళాల స్టీల్ వీల్స్ ఎంపిక వైటాలిటీ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఫ్రీడమ్ ఎడిషన్, ఫ్లయింగ్ ఎడిషన్‌లో 16-అంగుళాల అల్యూమినియం అల్లాయ్ వీల్స్ అందించారు.
ఈ కారులో నాలుగు విభిన్న రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆర్కిటిక్ బ్లూ, పోలార్ నైట్ బ్లాక్, వార్మ్ సన్ వైట్, పీచ్ పింక్ ఉన్నాయి. ఈ కారు లోపలి భాగంలో డీప్ ఓషన్ బ్లూ,డ్యూన్ పింక్ రంగులు చేర్చారు. మొబైల్ వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లు, హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో అందించారు. ఇందులో 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌తో 10.1-అంగుళాల రొటేటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఈ కారులో 30.08 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 305Km, 38.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో 405Km పరిధిని అందిస్తుంది. ఈ కారు గంటకు 0-50 కిలోమీటర్ల వేగాన్ని 4.9 సెకన్లలో వేగవంతం చేయగల శక్తిని కూడా కలిగి ఉంద