Last Updated:

Best Selling Bikes: మార్కెట్లో వీటికి తిరుగే లేదు..ఈ బైక్‌లనే కొనండి.. ఈ లిస్ట్‌ అస్సలు మిస్‌ అవ్వకండి..!

Best Selling Bikes: మార్కెట్లో వీటికి తిరుగే లేదు..ఈ బైక్‌లనే కొనండి.. ఈ లిస్ట్‌ అస్సలు మిస్‌ అవ్వకండి..!

Best Selling Bikes: భారతదేశంలో ఎంట్రీ లెవల్ బైక్‌ల అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ విక్రయాల నివేదికలను విడుదల చేశాయి. నివేదికల ఆధారంగా గత నెలలో అమ్మకాలు రెండు లక్షల రూపాయలను దాటిన మూడు బైక్‌లు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా కొత్త బైక్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఉపయోగపడే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Bajaj Pulsar
భారతీయ కస్టమర్లు ఇప్పటికీ బజాజ్ ఆటో పల్సర్ సిరీస్‌ని బాగా ఇష్టపడుతున్నారు. పల్సర్ సిరీస్‌లో అనేక వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ గత నెలలో 87,902 యూనిట్ల పల్సర్‌ను విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో 1,12,544 యూనిట్ల పల్సర్‌లను విక్రయించింది. గతేడాది కంటే ఈసారి కంపెనీ 24,643 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 21.90శాతం. పల్సర్ సిరీస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,984 నుండి ప్రారంభమవుతుంది.

Honda Shine
దేశంలో 125సీసీ బైక్ సెగ్మెంట్‌లో హోండాస్ షైన్ బెస్ట్ సెల్లింగ్ బైక్. ఈ బైక్ 125సీసీ,ఇప్పుడు 110సీసీ ఇంజన్‌లో అందుబాటులో ఉంది. గత నెలలో హోండా షైన్ 1,54,561 యూనిట్లు విక్రయించగా, గతేడాది ఇదే నెలలో 1,42,763 యూనిట్లు షైన్ అమ్ముడయ్యాయి. గతేడాది కంటే ఈసారి కంపెనీ 11,798 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 8.26శాతం. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.66 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Hero Splendor
ఇప్పుడు ప్రతి నెలా నెం.1 స్థానంలో నిలిచిన హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ బైక్ గురించి మాట్లాడుకుందాం. గతేడాది ఇదే నెలతో పోలిస్తే గత నెలలో స్ప్లెండర్ 2,07,763 యూనిట్లను విక్రయించింది. స్ప్లెండర్ 2,77,939 యూనిట్లను విక్రయించింది. గతేడాది కంటే ఈసారి కంపెనీ 70,176 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 21.65శాతం. ఈ బైక్‌లో 97.2cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.9 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చారు.

గత నెలలో 70,581 యూనిట్లు మాత్రమే విక్రయించిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ నాలుగో స్థానంలో ఉండగా, 37,954 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ అపాచీ ఐదవ స్థానంలో ఉంది, ఇది కాకుండా గత నెలలో 33,572 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ ఆరవ స్థానంలో ఉంది. 4130 యూనిట్ల విక్రయాలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ 7వ స్థానంలో ఉంది.