Half Day Schools: విద్యాశాఖ కీలక నిర్ణయం.. వచ్చే వారం నుంచి ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే!

Half Day Schools in Telangana from 15th March: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలలను ఒంటిపూట నడపాలని నిర్ణయించింది.
ఇక, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు చిరు వ్యా పారులు అల్లాడి పోతున్నారు. విద్యార్థుల గురించి ఇక చెప్పనక్కర్లేదు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ఈసారి ముందుగానే ఒంటిపూటబడులు పెట్టాలనే ఆలోచన చేసింది.
అయితే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణలో ఉర్దూ స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మార్చి 15 నుంచి అన్ని స్కూ ళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి, పగలు 12 గంటల వరకు ఉండనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం తరగతులు జరుగుతాయని సమాచారం. అలాగే ఏప్రిల్ 20 లేదా 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.