Last Updated:

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ!

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ!

AP Assembly Budget Session 2025: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వగా.. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌పై ప్రకటన విడుదల చేయగా.. ఇందులోని ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

మండలి ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ, ఎత్తుపై ప్రస్తావించారు. అయితే పోలవరం ఎత్తు తగ్గించారా లేదా చెప్పాలని ప్రభుత్వాన్ని వైసీపీ పభ్యులు కోరారు. దీంతో మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.

అయితే అప్పట్లో ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందన్నారు. ఫేజ్ 1 , ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది వైసీపీ అన్నారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును ఆపివేశారన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసి సర్వనాశనం చేశారన్నారు.