Vivo Y39 5G Launched: 6500mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ధర ఎంతంటే..?

Vivo Y39 5G Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన తాజా 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y39 5Gని మలేషియాలో నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ,అద్భుతమైన పనితీరుతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఫోన్‌లో ఉంటాయి. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం.
Vivo Y39 5G Feastures And Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.68-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1608×720 పిక్సెల్ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం చాలా బాగుంటుంది. ఫోన్ బరువు 205 గ్రాములు. ఈ ఫోన్‌ను హ్యాండిల్ చేయడం సులభం అనిపిస్తుంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫోన్‌ను త్వరగా అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, IP64 రేటింగ్ ఫోన్‌ను దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉంచుతుంది.
Vivo Y39 5G Processor
Vivo Y39 5G స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది 4nm ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో డేటా, యాప్‌లు, గేమ్‌లను సులభంగా స్టోరే చేయచ్చు. అలాగే, వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో 8GB వరకు అదనపు ర్యామ్‌ను పొందే అవకాశం ఉంది.
Vivo Y39 5G Battery
Vivo Y39 5G స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దాని శక్తివంతమైన 6500mAh బ్యాటరీ. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ ఒకే ఛార్జ్‌తో రోజంతా సౌకర్యవంతంగా పని చేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, ఈ ఫోన్ కేవలం 83 నిమిషాల్లో 1శాతం నుండి 100శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫోన్ Android 15 ఆధారంగా Funtouch OS 15తో రన్ అవుతుంది, ఇది వినియోగదారులకు కొత్త సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది.
Vivo Y39 5G Camera, Price
Vivo Y39 5G ఫోటోగ్రఫీ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే.. మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలానే f/1.8 ఎపర్చతో 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఓషన్ బ్లూ, గెలాక్సీ పర్పుల్ కలర్స్‌లో ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర MYR 1,099 అంటే సుమారుగా రూ. 20 వేల వరకు ఉంటుంది.