Prithviraj: ఎట్టకేలకు దిగొచ్చిన నటుడు పృథ్వీరాజ్ – క్షమాపణలు చెబతూ వీడియో రిలీజ్!
![Prithviraj: ఎట్టకేలకు దిగొచ్చిన నటుడు పృథ్వీరాజ్ – క్షమాపణలు చెబతూ వీడియో రిలీజ్!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/prithviraj-sorry-to-audiance.jpg)
Prithviraj Apologises Video: లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సినిమా ఈవెంట్‌లో పొలిటికల్ కామెంట్స్ చేయడాన్ని లైలా మూవీ టైం సైతం వ్యతిరేకించింది. ఇక అతడు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాత్రి రాత్రే బైయికాట్‌లైలా మూవీ అంటూ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. దీనిపై లక్షల్లో ట్వీట్స్ పుట్టుకొచ్చాయి.
పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై ఇప్పటికే విశ్వక్ సేన్, నిర్మాత స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. అయినా ఈ వివాదం సద్దుమణగలేదు. పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించండి అంతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ దిగొచ్చి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. “గోదావరి జిల్లాలో పుట్టి, పెరిగాను. కాబట్టి వెటకారం అనేది మా వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతం నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశాను.
ఇందుకు ఎవరి మనోభవాలైన దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకండి. సినిమాను కిల్ చేయకండి. సినిమాను ప్రేమిద్దాం.. గౌరవిద్దాం. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు. నాకు ఇంతటి క్రేజ్ తెచ్చిందే సినిమా. డోంట్ బాయికాట్ లైలా.. వెలకమ్ టూ లైలా. ఈ ఫిబ్రవరి 14న లైలా సినిమా థియేటర్‌లో విడుదలైంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాను ప్రేమించండి” అని చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇకనైనా లైలా వివాదం సద్దుమణుగుతుందా లేదా చూడాలి.
క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ #Laila #PrudhviRaj pic.twitter.com/WbufeIVcpu
— Milagro Movies (@MilagroMovies) February 13, 2025
కాగా లైలా సినిమాలో పృథ్వీరాజ్ ఓ ముఖ్యపాత్ర పోషించారు. ఇందులో ఆయన మేకల సత్యం పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తన పాత్ర గురించి ప్రస్తావించారు. ‘మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ పరోక్షంగా తమ పార్టీనే ఉద్దేశించిన చేశారంటూ వైసీపీ పార్టీ శ్రేణులు ఫైర్ అయ్యారు. ‘బాయ్ కాట్ లైలా’ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేశారు.