Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం: మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులతో బంధువులతో విభేదాలు ఏర్పడి పరిస్థితి గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకుంటే పదిమంది దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు చెప్పే మాటలు ఎవరికీ రుచించవు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటమే చెప్పదగినది. వ్యాపార పరంగా వ్యాపారస్తులకు బాగున్నప్పటికీ మధ్యవర్తి ద్వారా నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఆర్థిక విషయాలలో ఒకరికి చోటు ఇవ్వకుండా మీకు మీరుగా పరిశీలించుకోవడం అనేది ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ ఓర్పు సహనం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అంతా అనుకూలంగా లేదు. విద్యార్థి విద్యార్థులు చదువు పైన మరింత శ్రద్ధ పెట్టాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికే కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా లాభ సాటిగా ఉంటుంది. లోన్లు మంజూరు అవుతాయి. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ కళ నెరవేరుతుంది. వాహనయోగం ఉంది. బంధువులతో కలిసి దైవదర్శనాలు ప్రయాణాలు చేసుకుంటారు. కొన్ని శుభకార్యాలలో మీ వంతుగా సహాయం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్నది ఒకటే జరుగుతుంది ఒకటే అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. కెరియర్ పరంగా ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. శనివారం రోజున నలుపు వత్తులతో శనీశ్వరుడికి దీపారాధన చేయండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
మిథునం : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి సినిమా రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి ఎలా ఉంటుంది వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై దీర్ఘంగా ఆలోచనలు చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాలలో ఉండే విద్యను అభ్యసించే వారికి చిన్నపాటి ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి గో సేవ చేయండి లేదా అన్నదానం చేయండి దీనివలన ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు . ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది ప్రమోషన్స్ గాని ఇంక్రిమెంట్లు గాని వచ్చే సూచన ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అవార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది . కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు . ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ వారం వీలైనంత వరకు మౌనంగా ఉండడం అలాగే ఏదైనా వ్యవహారాలు ఉంటే సరిచేసుకోవడం చెప్పదగిన సూచన. పిల్లల సంతానం పట్ల, వివాహం పట్ల ఎక్కువ దిగులు అనేది ఏర్పడుతుంది. . ముఖ్యంగా మీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ముందుకు వెళ్లడం నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది .మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతి నిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఆరావళి కుంకుమ ప్రతిరోజు ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రే.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టేవిగా ఉండవు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో మధ్యవర్తి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మదిన స్త్రీలకు వృత్తి వ్యాపారలపరంగా బాగుంటుంది ఉద్యోగ పరంగా మంచి స్థానాన్ని సంపాదించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పత్తి వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చి దిక్కు ఉత్తరం కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా మార్పులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. మాటతీరును బట్టి కొన్ని మార్పులు ఉంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడే దానికి చేసే పనికి కొంచెం పొంతన లేకుండా ఉంటుంది ఇక్కడ జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో చిన్నచిన్న అడ్డంకులు ఏర్పడతాయి. మనం మాట్లాడే విధానాన్ని బట్టి కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటుంది. ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేయండి. ఆభరణాలు కూడా కొనే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వ్యాపారపరంగా చివరకు బాగానే కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. బందు వర్గంలో కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు చూసుకోవాలి. ఇమ్యూనిటీ తగ్గుతుంది జలుబు ఆస్తమా లాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చిన సంబంధాలు బాగున్నాయో లేవో నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్లాలి. ఏదైనా సరే సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు నలుగురి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించండి . ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.
తుల: తులారాశి రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు ఇంట బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా బాధ్యతను మీరు తీసుకుంటే సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే కృషి ఫలిస్తుంది. గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది అయినప్పటికీ కష్టపడి చదవాలి. శుక్ర గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇంట బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. భూ సంబంధిత వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు , జనాధారణ పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు శృతిమించి రాగానపడతాయి, కాబట్టి ప్రతి విషయంలో కూడా సర్దుకుపోయే స్వభావాన్ని అలవాటు చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు మెరూన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా చేజార్చుకోవద్దు. ధనానికి సంబంధించిన విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అంతా అనుకూలంగా ఉంది నూతన ప్రాజెక్టుల ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది. మీకు ఎదురైనా ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలపరంగా మీరు చేసిన కృషి ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంది. వాహన యోగం ఉంది. స్వగృహ నిర్మాణ కల నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాదాలకు దూరంగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. విద్యార్థినీ విద్యార్థులు జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి సంఖ్య రెండు కలిసివచ్చే దిక్కు పడమర కలిసివచ్చే రంగు స్కై బ్లూ.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. సంతాన విషయంలో ధనం ఖర్చు అవుతుంది. సంతానం యొక్క క్రమశిక్షణపై దృష్టి సారిస్తారు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా పట్టు విడుపులు పాటిస్తారు. ఏదైనా అమ్మాలన్నా లేదా కొనాలన్నా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే దిక్కులు పడమర కలిసి వచ్చే రంగు గ్రీన్.
మీనం: మీన రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ చదువు తగిన ఉద్యోగం లభిస్తుంది మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం బాగుంది. మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు గ్రీన్.